మళ్ళీ అమ్మకాల ఒత్తిడి
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి ఒక మోస్తరు నష్టాలతో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 15234ని తాకింది. ఇపుడు 115 పాయింట్ల నష్టంతో 15254 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 350 పాయింట్ల నష్టంతో ఉంది. దాదాపు అన్ని సూచీలు ఒక శాతం నష్టంతో ఉన్నాయి. నిఫ్టి నెక్ట్స్ 1.26 శాతం, నిఫ్టి మిడ్ క్యాప్ 1.34 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి ఏకంగా 40 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిన్న భారీగా క్షీణించిన మెటల్స్ షేర్లు కాస్త గ్రీన్‌లో ఉన్నా.. ఐటీ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. నిఫ్టి టాప్ లూజర్స్‌లో విప్రో, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కన్పిస్తోంది. మిడ్‌క్యాప్ ఐటీ షేర్లు భారీగా క్షీణించడంతో నిఫ్టి మిడ్ క్యాప్ సూచీ భారీగా నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టిలోని 12 షేర్లూ నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టి తొలి మద్దతు 15200 వద్దగా, రెండో స్థాయి రూ. 15144 వద్ద ఉంది. ఈ స్థాయిల్లో మద్దతు లభించే పక్షంలో నిఫ్టి భారీగా కోలుకునే అవకాశముంది. మిడ్ సెషన్‌లోగా అంటే యూరో మార్కెట్ల ప్రారంభం లోగా నిఫ్టి రికవరీ వస్తుందేమో చూడాలి.
