NIFTY TRADE: పెరిగితే అమ్మడమే
నిన్న ప్రపంచ మార్కెట్లు భారీగా పెరిగినా మన మార్కెట్లు నామ మాత్రపు లాభాలకు పరిమితమైంది. రాత్రి అమెరికా మార్కెట్ల భారీ లాభాలతో పాటు ఆసియా మార్కెట్ల జోరుతో నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే 16,550ని దాటే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎల్లుండి వీక్లీ, మంత్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉన్నందున సూచీలలో ట్రేడింగ్ జోరుగా సాగుతోంది. షేర్ల ధరలు క్షీణిస్తున్నా… నిఫ్టి గ్రీన్‌లో ఉంటోంది. ఏడు రోజుల పతనం తరవాత క్రూడ్ రాత్రి భారీగా పెరిగింది. దీంతో మన మార్కెట్‌పై ఒత్తిడి ఉండొచ్చు. నిఫ్టి క్రితం ముగింపు 16,496. నిఫ్టికి ఇవాళ ఇదే కీలక స్థాయి. దీనిపైన ఉన్నంత వరకు నిఫ్టి పరవాలేదు. ఓపెనింగ్‌లో నిఫ్టి 15,560పైన ప్రారంభమైతే అమ్మకాల ఒత్తిడి ఖాయం. 16,590 స్టాప్‌లాస్‌తో అమ్మొచ్చు. నిఫ్టి గనుక 15620 దాటితే నిఫ్టి భారీగా క్షీణించకపోవచ్చు. లాభాల స్వీకరణ కారణంగా నిఫ్టి గనుక 16,430 ప్రాంతానికి వస్తే కొనుగోలు చేయొచ్చు. స్టాప్‌లాస్ 16,400. నిఫ్టి భారీ లాభాలతో ప్రారంభం అవుతుంది కాబట్టి.. అమ్మడం తప్ప మరో ఛాన్స్‌లేదు. అయితే స్టాప్‌లాస్ జాగ్రత్తగా పాటించండి.