For Money

Business News

చివర్లో కోలుకున్నా… నష్టాలే

మార్కెట్‌ రోజంతా నష్టాల్లో కొనసాగింది. యూరో మార్కెట్లు ఆరంభంలో గ్రీన్‌లోకి వచ్చినా… వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. జర్మనీ డాక్స్ వంటి కీలక సూచీలు ఒక శాతంపైగా నష్ట పోవడంతో…. నిఫ్టిపై మరింత ఒత్తిడి పెరిగింది. నష్టాల నుంచి కోలుకున్నట్లే కన్పించిన నిఫ్టి.. మరింత బలహీనపడి 16,478 పాయింట్ల కనిష్ఠ స్థాయికి చేరింది. డే ట్రేడింగ్‌ స్క్వేర్‌ ఆఫ్‌ టైమ్‌…అంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి మార్కెట్‌లో షార్ట్‌ కవరింగ్ వచ్చింది. దీంతో నిఫ్టి దాదాపు వంద పాయింట్లకు పైగా కోలుకుంది. 16,628 పాయింట్ల వద్ద (తాత్కాలిక ముగింపు) ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 165 పాయింట్లు నష్టపోయింది. నిజానికి ఇవాళ్టి ఓపెనింగ్‌ (16,593)తో పోలిస్తే నిఫ్టి 35 పాయింట్లు లాభంతో ముగిసింది. నిఫ్టిని దెబ్బతీసిన షేర్లలో బ్యాంక్‌ షేర్లు ముందున్నాయి. చివర్లో ఈ షేర్లు కోలుకున్నా… మారుతీ, డాక్టర్‌ రెడ్డీస్‌, బజాజ్‌ ఆటో షేర్లలో వచ్చిన ఒత్తిడి నిఫ్టిని దెబ్బతీశాయి. బ్యాంక్‌ నిఫ్టి రెండు శాతం, నిఫ్టి ఒక శాతం నష్టంతో క్లోజ్‌ కాగా, మిడ్‌ క్యాప్‌ మాత్రం కేవలం 0.25 శాతం నష్టంతో ముగిసింది. ఉదయం నుంచి లాభాల్లో ఉన్న నిఫ్టి నెక్ట్స్‌ మిడ్‌ సెషన్‌లో నష్టాల్లోకి వెళ్ళింది. క్లోజింగ్‌కల్లా లాభాల్లోకి వచ్చి గ్రీన్‌లో ముగిసింది.