16,800పైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టి సూచించిన స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 16,809 పాయింట్లను తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 93 పాయింట్ల లాభంతో 16,798 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి 47 షేర్లు లాభాల్లో ఉన్నాయి. దాదాపు అన్ని సూచీలు ఒకస్థాయిలో లాభాల్లో ఉండటం విశేషం. బ్యాంక్ నిఫ్టి, నిఫ్టినెక్ట్స్ 50, మిడ్ క్యాప్ … అన్ని సూచీలు అర శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. డాలర్ క్షీణించడంతో మెటల్స్ మరింత బలపడ్డాయి. రైట్స్ ఇష్యూ ప్రకటించిన ఎయిర్‌టెల్ షేర్ స్వల్ప నష్టంతో ప్రారంభమైంది. నాస్‌డాక్ ఒకటిన్నర శాతం పెరిగినా.. భారత ఐటీ కంపెనీల్లో పెద్ద ఆసక్తి కన్పించడం లేదు. డాలర్ క్షీణించడమే దీనికి ప్రధాన కారణం కావొచ్చు. నిఫ్టిని అధిక స్థాయిలో అంటే 16,800పైన లాభాలు స్వీకరించడం మంచిదని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుదర్శన్ సుఖాని ఇన్వెస్టర్లకు సలహా ఇస్తున్నారు. ఈ స్థాయిలో కొనుగోలు చేయడం రిస్క్‌తో కూడుకున్నదని… నిఫ్టి నిలదొక్కుకునేంత వరకు ఆగడం మంచిదని ఆయన సలహా ఇచ్చారు.
నిఫ్టి టాప్ గెయినర్స్
టాటా స్టీల్ 1,413.75 2.14
హిందాల్కో 445.40 1.71
టాటా మోటార్స్ 290.40 1.63 జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 686.70 1.36
కోల్ ఇండియా 140.40 1.34
నిఫ్టి టాప్ లూజర్స్
భారతీ ఎయిర్‌టెల్ 593.30 -0.31
టెక్ మహీంద్రా 1,441.45 -0.27
ఇన్ఫోసిస్ 1,708.60 -0.01