For Money

Business News

షేర్‌ మార్కెట్‌ కకావికలం

ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ చర్యలు ప్రారంభించడంతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలతున్నాయి. అనేక కౌంటర్లలో కొనేవారు లేని పరిస్థితి నెలకొంది. అమెరికా నుంచి భారత్‌ మార్కెట్‌ వరకు అన్ని స్టాక్‌ మార్కెట్లలో భారీ ఒత్తిడి కన్పిస్తోంది. ఏం జరుగుతుందో తెలియన అనిశ్చితిలో ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న షేర్లను వొదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా డాలర్, క్రూడ్‌, బంగారం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో …షేర్‌ మార్కెట్‌లో ఒత్తిడి పెరుతుతోంది. నిఫ్టి ఏకంగా 520 పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమైంది. ఇపుడు 470 పాయింట్ల నష్టంతో 16592 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 1500పాయింట్లకు పైగా క్షీణించింది. అన్ని సూచీలు భారీ నష్టాల్లో ఉన్నాయి. మార్కెట్‌ దూరంగా ఉండాలని, ఎవరూ ప్రస్తుత రేట్లలో కొనుగోలు చేయొద్దని అనలిస్టులు హెచ్చరిస్తున్నారు.