బ్యాంకుల అండ…

నిఫ్టి నష్టాల్లో ముగిసినా… మార్కెట్ కాస్త స్థిరంగా ఉందనే చెప్పాలి. వీక్లీ డెరివేటివ్స్ ముగింపు రోజున నిఫ్టి కేవలం 36 పాయింట్ల నష్టంతో ముగియడం విశేషం. ముఖ్యంగా చివరి అరగటంలో మంచి షార్ట్ కవరింగ్ వచ్చింది. ఇవాళ బ్యాంకు నిఫ్టి సూచీ నిఫ్టికి అండగా నిలిచింది. అలాగే మిడ్ క్యాప్స్‌లో అమ్మకాల ఆగడం శుభపరిణామం. నిఫ్టి 24399 వద్ద క్లోజ్ కాగా, సెన్సెక్స్ 80065 వద్ద ముగిసింది. సెన్సెక్స్ దాదాపు క్రితం ముగింపు వద్దే క్లోజైనట్లు చెప్పుకోవచ్చు. అల్ట్రాటెక్ సిమెంట్ ఇవాళ రెండున్నర శాతం పైగా లాభంతో నిఫ్టి టాప్ గెయినర్‌గా నిలిచింది. తరవాతి స్థానాల్లో శ్రీరామ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, టైటాన్, గ్రాసిం నిలబడ్డాయి. అయితే నిరాశజనక ఫలితాలు ప్రకటించిన కంపెనీల షేర్లలో మాత్రం అమ్మకాల జోరుగా ఉన్నాయి. హెచ్‌యూఎల్ ఇవాళ దాదాపు ఆరు శాతం నష్టపోయింది. ఎస్‌బీఐ లైఫ్ 4.5 శాతం, హిందాల్కో 3.7 వాతం, నెస్లే 2.7 శాతం నష్టపోగా, బజాజ్ ఆటో కూడా 2.69 శాతం నష్టంతో క్లోజైంది.