సూపర్.. పటిష్ఠంగా ముగిసిన నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్లకు భిన్నంగా మన మార్కెట్లు చాలా పటిష్ఠంగా ముగిశాయి. ఉదయం ఒకదశలో మిడ్‌సెషన్‌లో 17532కు క్షీణించిన నిఫ్టి… తరవాత అనూహ్యంగా కోలుకుంది. రాత్రి అమెరికా, ఉదయం ఆసియా మార్కెట్ల పతనానికి నిఫ్టి రియాక్టయింది. అయితే మిడ్ సెషన్లో ప్రారంభమైన యూరో మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో స్పందించడంతో వెంటనే కోలుకుంది. ఒకదశలో గ్రీన్‌లోకి వచ్చి 17722ని తాకింది. వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ కారణంగా చివర్లో వచ్చిన స్వల్ప ఒత్తిడి కారణంగా 17638 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 80 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టిలో 22 షేర్లు గ్రీన్‌లో క్లోజ్ కాగా 28 షేర్లు నష్టాలతో ముగిశాయి. కాని బ్యాంక్ షేర్లు చాలా రోజులు తరవాత నెగిటివ్‌గా రియక్టయ్యాయి. నిఫ్టి నెక్ట్స్, నిఫ్టి మిడ్ క్యాప్ షేర్లు గ్రీన్‌లో క్లోజ్ కాగా… నిఫ్టి బ్యాంక్ 1.35 శాతం నష్టంతో ముగిసింది. డాలర్ దాదాపు ఒక శాతం బలపడటంలో ఐటీ షేర్లు కోలుకున్నాయి. అయితే అసలు ర్యాలీ వచ్చింది మాత్రం ఎఫ్ఎంసీజీ షేర్లలో. ముఖ్యంగా క్రూడ్ ఆధార పరిశ్రమల షేర్లు చాలా పాజిటివ్‌గా రియక్టయ్యాయి. గత కొన్ని రోజులగా ఫుట్‌వేర్ షేర్లకు మంచి డిమాండ్ వస్తోంది. దాదాపు అన్ని షేర్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. మరోసారి నిఫ్టికి 17500 చాలా గట్టి సపోర్ట్‌గా నిలిచింది. రేపటి ట్రెండ్ ఇపుడు కీలకం కానుంది.