For Money

Business News

నష్టాలతో ముగిసిన నిఫ్టి

నిన్న అమెరికా, ఇవాళ యూరప్‌ మార్కెట్లు గ్రీన్‌ ఉన్నా మన మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. నిఫ్టి 70 పాయింట్ల నష్టంతో 17153 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టి ఇవాళ తొలి మద్దతు స్థాయి 17200 దిగువకు వెళ్ళి 17076ని తాకినా… చివర్లో కోలుకుని 17150పైన ముగిసింది. ఇవాళ టైటాన్, టెక్‌ మహీంద్రా, మారుతీ షేర్లు నిఫ్టిని దెబ్బతీశాయి. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఇవాళ కూడా 0.4 శాతం నష్టంతో ముగిసింది. నిన్న నాలుగు కోట్ల షేర్లను అమ్మినా.. కొటక్‌ మహీంద్రా ఇవాళ 0.67 శాతం నష్టపోవడం విశేషం. బ్యాంక్‌ నిఫ్టి ఇవాళ గ్రీన్‌లోకి వచ్చినా చివరి కొద్ది నిమిషాల్లో భారీ అమ్మకాలతో మళ్ళీ నష్టాల్లోకి జారుకుంది. నిఫ్టి నెక్ట్స్‌ గ్రీన్‌లో క్లోజ్‌ కాగా, నిఫ్టి మిడ్‌ క్యాప్ రెడ్‌లో ముగిసింది. అయితే లాభనష్టాలు ఇవాళ నామమాత్రంగానే ఉన్నాయి.