For Money

Business News

రోజంతా గ్రీన్‌లోనే..

ఆరంభంలో నిఫ్టి దాదాపు క్రితం స్థాయిని తాకినా… తరవాత క్రమంగా కోలుకుంది. మిడ్‌ సెషన్‌లోకాస్త ఒత్తిడి వచ్చినా… క్లోజింగ్‌కు ముందు 23350ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే 186 పాయింట్ల లాభంతో 23332 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇవాళ రాత్రికి సుంకాలను ప్రకటించనున్నారు. యావత్‌ ప్రపంచ మార్కెట్లు ఈ సుంకాల కోసం ఎదురు చూస్తున్నాయి. నిన్నటి మాదిరే ఇవాళ కూడా మెజారిటీ భాగం షేర్లు గ్రీన్లో ముగిశాయి. ఇవాళ 2977 షేర్లు ట్రేడవగా, 2148 షేర్లు గ్రీన్‌లో ముగిశాయి. ఇవాళ లోయర్‌ సర్క్యూట్‌ను తాకిన షేర్ల సంఖ్య కేవలం 26 కాగా, అప్పర్‌ సర్క్యూట్‌ను తాకిన షేర్ల సంఖ్య 247. నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో టాటా కన్జూమర్‌ టాప్‌ గెయినర్‌ కాగా, తరువాతి స్థానాల్లో జొమాటొ, టైటాన్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా ఉన్నాయి. ఇక నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో బీఈఎల్‌ నిలిచింది. తరవాతి స్థానాల్లో నెస్లే ఇండియా, అల్ట్రాటెక్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, పవర్‌ గ్రిడ్‌ ఉన్నాయి.