For Money

Business News

దిగువస్థాయిలో మద్దతు..

అదే ట్రెండ్‌ ఇవాళ కూడా కొనసాగింది. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసినా… ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు ఆకర్షణీయ లాభాల్లో ఉన్నా…నిఫ్టి ఆరంభంలోనే నష్టాలను తాకింది. 23170 పాయింట్ల స్థాయిని తాకింది. అక్కడి నుంచి కోలుకుంది. పదింటిలోపు ట్రేడర్లందరూ తమ పొజిషన్స్‌ సర్దుకున్నాక ర్యాలీ మొదలైంది. మొత్తం మార్కెట్‌ కొంత మంది ఆపరేటర్ల చేతిలో ఉందడనానికి ఇదే ఉదాహరణ. ఎఫ్‌ అండ్‌ ఓలో తమ పొజిషన్స్‌ను సర్దుకున్న తరవాత తీరిగ్గా 10 గంటల తరవాత కొనుగోళ్ళు మొదలయ్యాయి. నిఫ్టి ఇవాళ 23391 పాయింట్లను గరిష్ఠ స్థాయికి చేరింది. అక్కడే కాస్త ఇటూఅటుగా రోజంతా కదలాడింది. ఇవాళ అమెరికా మార్కెట్లకు సెలవు. దీంతో రేపటికి క్లూస్‌ ఏమీ లేవు. అయినా నిఫ్టి 141 పాయింట్ల లాభంతో 23344 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 454 పాయింట్ల లాభంతో ముగిసింది. ఇవాళ కూడా కార్సొరేట్‌ ఫలితాలకు మార్కెట్‌ బాగా స్పందించింది. మంచి ఫలితాలు సాధించిన కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 9 శాతంపైగా లాభంతో నిఫ్టి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. అదే కారణంతో విప్రో కూడా ఆరున్నర శాతం లాభంతో రెండోస్థానంలో నిలిచింది. ఇక ఎస్‌బీఐ లైఫ్‌, ట్రెంట్‌, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, అదానీ పోర్ట్స్‌ నిఫ్టిలో టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి.