For Money

Business News

బంపర్‌ లాభాలతో ముగిసిన నిఫ్టి

ఆరంభం నుంచి చివరి దాకా ఎక్కడ ఒత్తిడి ఎదుర్కోకుండా దాదాపు 17500 దాకా వెళ్ళింది నిఫ్టి. ఉదయం 17308 పాయింట్లన తాకిన నిఫ్టి… ట్రేడింగ్‌ చివర్లో కూడా ఎలాంటి ప్రతిఘటనను ఎదుర్కొనలేదు. దీంతో 17,484ని తాకి 17469 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 293 పాయింట్లు లాభపడింది. చాలా రోజుల తరవాత అన్ని సూచీలు ఒకేస్థాయి లాభాలతో ముగిశాయి. నిఫ్టి నెక్ట్స్‌, మిడ్‌క్యాప్‌ నిఫ్టి, బ్యాంక్‌ నిఫ్టి సూచీలన్నీ 1.7 శాతంపైనే ముగిశాయి. ఆర్‌బీఐ పాలసీ కారణంగా బ్యాంకింగ్‌, ఎన్‌బీఎఫ్‌సీల షేర్లు గణనీయ లాభంతో ముగిశాయి. ఇక మిడ్‌క్యాప్‌లో మైండ్‌ట్రీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. నిఫ్టిలో 45 షేర్లు లాభాలతో ముగిశాయి.