23000కు చేరువలో నిఫ్టి

నిఫ్టి ఒకదశలో 23000లకు చేరువైంది. మిడ్ సెషన్లో నిఫ్టి 22923 పాయింట్లను తాకింది. అక్కడ వచ్చిన లాభాల స్వీకరణ కారణంగా 22768ని తాకిని… చివర్లో స్వల్పంగా కోలుకుని 22828 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 428 పాయింట్లు పెరిగింది. దాదాపు అన్ని సూచీలు ఇవాళ గ్రీన్లో ముగిశాయి. సూచీలతో పాటు షేర్లు కూడా ఆకర్షణీయ లాభాలు పొందాయి. ఇవాళ 2959 షేర్లు ట్రేడవగా, ఇందులో 2380 షేర్లు గ్రీన్‌లో ముగిశాయి. నష్టాలతో ముగిసిన షేర్ల సంఖ్య 491. ఇవాళ 23 షేర్లు లోయర్ సర్క్యూట్‌లో క్లోజ్ కాగా, 491 షేర్లు అప్పర్ సర్క్యూట్‌లో ముగిశాయి. మార్కెట్‌లో ఇవాళ మెటల్, ఫార్మా షేర్లకు గట్టి మద్దతు లభించింది. నిఫ్టిలో టాప్ గెయినర్‌గా హిందాల్కో నిలిచింది. తరువాతి స్థానంలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, కోల్ ఇండియా షేర్లు ఉన్నాయి. ఇక నిఫ్టిలో టాప్ లూజర్స్‌లో కేవలం మూడు షేర్లు మాత్రమే ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్ టాప్‌లో ఉండగా, దాని తరవాత అపోలో హాస్పిటల్స్, టీసీఎస్ షేర్లు ఉన్నాయి.