For Money

Business News

చివరిదాకా షార్ట్‌ కవరింగ్‌

అన్ని ప్రధాన షేర్లలో ట్రేడింగ్‌ చివరి దాకా షార్ట్‌ కవరింగ్‌ కన్పించింది. అనేక షేర్లు ఇంట్రాడేలో స్పల్పంగా ఒత్తిడికి లోనైనా వెంటనే కొనుగోళ్ళ మద్దతు అందింది. అనేక షేర్లు అప్పర్‌ సర్క్యూట్‌లో ముగిశాయి. నిఫ్టి ఇవాళ 17344 పాయింట్లను తాకింది. చివర్లో కొద్దిపాటి ఒత్తిడి రావడంతో 17287 పాయింట్ల వద్ద నిఫ్టి ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 312 పాయింట్లు లాభపడింది. దాదాపు అన్ని సూచీలు 1.5 శాతంపైగా లాభంతో ముగిశాయి. మిడ్‌ సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్లు నష్టాల్లోఉన్నా… మన మార్కెట్లు మాత్రం భారీ లాభాలతో ముగియడం విశేషం. అమెరికా ఫ్యూచర్స్‌ కూడా నష్టాల్లో ముగిశాయి. అలాగే క్రూడ్‌ ఆయిల్‌ నాలుగు శాతంపైగా లాభంతో 102 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ముఖ్యంగా ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ ముగింపు కారణంగా చివరికి దాకా షార్ట్‌ కవరింగ్ కొనసాగింది. ఇవాళ నిఫ్టిలో హెచ్‌డీఎఫ్‌సీ టాప్‌ గెయినర్‌ నిలవడం విశేషం. మార్కెట్‌ ఆకర్షణీల లాభాలు గడించినా… పేటీఎం షేర్‌ ఇవాళ ఆరు శాతంపైగా నష్టంతో ముగిసింది.