For Money

Business News

చివరికి నష్టాలే మిగిలాయి

ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్‌… నష్టాలతోనే ముగిసింది. మధ్యపాలు మార్లు నష్టాల్లోకి వెళ్ళినా.. కోలుకున్న మార్కెట్‌ చివర్లో చతికిల పడింది. యూరో మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభం కావడంతో మిడ్‌సెషన్‌లో 16404 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన నిఫ్టి … తరవాత క్రమంగా బలహీపడుతూ ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 16197ని తాకింది. కాని చివర్లో స్వల్పంగా కోలుకుని 16,240 వద్ద ముగిసింది. అయితే సెన్సెక్స్‌ మాత్రం 55 పాయింట్ల లాభంతో 54364 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టి స్వల్ప లాభంతో, నిఫ్టి బ్యాంక్‌ లాభంతో ముగిసినా… నిఫ్టి నెక్ట్స్‌, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ భారీ నష్టాల్లో ముగియడం విశేషం. మిడ్‌ క్యాప్‌ షేర్లలో అదానీతో పాటు న్యూఏజ్‌ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. దీంతో నిఫ్టి నెక్ట్స్‌ 2 శాతంపైగా నష్టపోయింది. ఇక నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ కూడా 1.79 శాతం నష్టపోయింది. వోల్టాస్‌, పేజ్‌ ఇండస్ట్రీస్‌, ట్రెంట్, డిక్షన్‌ భారీ నష్టాలతో ముగిశాయి. అమెరికా ఫ్యూచర్స్‌ గ్రీన్‌లో ఉన్నా.. మన మార్కెట్‌ ముఖ్యంగా ద్వితీయ శ్రేణి షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి రావడం మార్కెట్‌ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.