మిడ్ క్యాప్స్‌లో ఒత్తిడి

ఇవాళ మార్కెట్ ఆరంభం నుంచి నష్టాల్లో కొనసాగింది. రేపు ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ప్రకటించనున్న నేపథ్యంలో అనేక సూచీలు నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టి స్థిరంగా ముగిసింది. అలాగే ఫైనాన్షియల్ నిఫ్టి కూడా. లేకుంటే నిఫ్టి మరింతగా నష్టపోయేది. నిఫ్టి ఇవాళ 93 పాయింట్ల నష్టంతో 23603 వద్ద ముగిసింది. 23773 పాయింట్ల స్థాయిని తాకిన నిఫ్టి క్రమంగా క్షీణిస్తూ మిడ్ సెషన్ సమయానికి 23556 పాయింట్లకు పడిపోయింది. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ ముగింపు కారణంగా చివరల్లో స్వల్ప షార్ట్ కవరింగ్ వచ్చినా… నిఫ్టికి భారీ నష్టాలు తప్పలేదు. నిఫ్టిలో ఇవాళ 30 షేర్లు నష్టపోయాయి. ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడంతో ట్రెంట్ ఇవాళ ఎనిమిదన్నర శాతం నష్టంతో రూ. 5268 వద్ద ముగిసింది. నిఫ్టి టాప్ లూజర్ ఈ షేరే. బీఈఎల్ కూడా మూడు శాతం నష్టపోయింది.ఇవాళ ఫార్మా షేర్లు బాగుతున్నాయి. దాదాపు ప్రధాన ఫార్మా కంపెనీల షేర్లన్నీ గ్రీన్‌లో ముగిశాయి. ఇవాళ బాగా నష్టపోయిన షేర్లలో మిడ్ క్యాప్స్ ఉన్నాయి. సూచీ ఒక శాతం దాకా నష్టపోగా డిక్సన్ టాప్ లూజర్‌గా నిలిచింది. వోల్టాస్, ఇండియన్ హోటల్స్, పాలిక్యాబ్ షేర్లు మూడు శాతం నష్టపోయాయి. ఫలితాలు బాగుండటంతో కమిన్స్ ఒకటిన్నర శాతంతో లాభపడింది.