For Money

Business News

షేర్లు అప్‌… సూచీలు డౌన్‌

ఏషియన్‌ పెయింట్స్‌ వంటి కొన్ని ప్రధాన కౌంటర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి రావడంతో సూచీలు రెడ్‌లో ముగిశాయి. ఉదయం నుంచి నిఫ్టీ ఒక మోస్తరు లాబాలకు పరిమితమైంది. నిన్న ఉత్సాహం కొరవడింది. దీనికి ప్రధాన కారణం గూగుల్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి. అమెరికా ఫ్యూచర్స్‌ అరశాతంపైగా నష్టాల్లో ఉన్నాయి. అలాగే యాపిల్ కంపెనీపై చైనా ఆంక్షలు విధించవచ్చనే వార్తలతో ఆ షేర్‌ కూడా నష్టాల్లో ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన షేర్లలో ఒత్తిడి కారణంగా మార్కెట్‌లో రెడ్‌లో ముగిసినా… అధిక శాతం షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టి 43 పాయింట్ల నష్టంతో 23696 వద్ద ముగిసింది. అయితే చాలా వరకు ప్రధాన సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. బ్యాంక్‌ నిఫ్టి, మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌తో పాటు పలు ప్రధాన సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. ఇవాళ 2913 షేర్లలో ట్రేడింగ్‌ జరగ్గా, 1969 షేర్లు గ్రీన్‌లో ముగిశాయి. 184 షేర్లు అప్పర్‌ సర్క్యూట్‌తో క్లోజ్‌ కాగా, కేవలం 44 షేర్లు లోయర్‌ సర్క్యూట్‌లో ముగిశాయి. ఇక నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో వరుసగా హిందాల్కో, ఐటీసీ హోటల్స్‌, ఓఎన్‌జీసీ, అపోలో హాస్పిటల్స్‌, బీపీసీఎల్‌ షేర్లు ఉన్నాయి. ఇక నష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్లలో ఏషియన్‌ పెయింట్స్‌, టైటాన్‌, నెస్లే, బ్రిటానియా, టాటా కన్జూమర్‌ ఉన్నాయి.