For Money

Business News

నష్టాల్లో ముగిసిన నిఫ్టి

ఉదయం ఆకర్షణీయ లాభంతో ప్రారంభమైన నిఫ్టి 11 గంటలకల్లా నష్టాల్లోకి జారుకుంది. అప్పటి నుంచి నష్టాల్లోనే కొనసాగింది. 18296 పాయింట్ల నుంచి 18117 పాయింట్లకు క్షీణించింది. క్లోజింగ్‌ ముందు స్వల్పంగా కోలుకున్నా… 18157వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 46 పాయింట్ల నష్టంతో ముగిసింది. అదానీ పోర్ట్స్‌ టాప్‌ గెయినర్‌గా నిలవగా, రెండో స్థానంలో కోల్‌ ఇండియా నిలిచింది. ఐటీసీ ఇవాళ మరో రెండు శాతం పెరిగింది. ఇక నష్టాల్లో హిందాల్కో 5 శాతం నష్టంతో టాప్‌లో ఉంది. దివీస్‌ ల్యాబ్‌ ఇవాళ కూడా 3.44శాతం క్షీణించింది. ఇవాళ అత్యధికంగా నిఫ్టి మిడ్‌ క్యాప్‌ నష్టపోయింది. నిఫ్టి బ్యాంక్‌ గ్రీన్‌లో ముగిసింది. ఇవాళ్టి స్టార్‌ షేర్‌ పీఐ ఇండస్ట్రీస్‌. ఏకంగా పది శాతం లాభంతో ముగిసింది. ఇక మిడ్‌ సైజ్‌ బ్యాంకుల్లో ర్యాలీ కొనసాగుతోంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్ ఇవాళ ఏడు శాతం లాభపడగా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా మరో అయిదు శాతం పెరిగింది. నైకా ఇవాళ 8 శాతం క్షీణించగా, ఎంఆర్‌ఎఫ్‌ 9 శాతం తగ్గింది.