For Money

Business News

డాక్టర్‌ రెడ్డీస్‌ ఆప్షన్‌ సూపర్‌

మన స్టాక్‌ మార్కెట్ ఇవాళ కూడా లాభాల్లో ముగిసింది. వరుసగా 13వ సెషన్‌లో కూడా నిఫ్టి లాభాల్లో ముగియడం కొత్త రికార్డు. చైనా, హాంగ్‌కాంగ్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నా అమెరికా మార్కెట్ల బాటలో నిఫ్టి కొనసాగింది. ముఖ్యంగా ఫైనాన్షియల్‌, ఐటీ స్టాక్స్‌ నుంచి అందిన మద్దతు కారణంగా నిఫ్టి ఒకదశలో 25,300 పాయింట్ల స్థాయిని దాటింది. నిఫ్టి 12 గంటల నుంచి ఒంటి గంట మధ్య తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైంది. నిఫ్టి ఒకదశలో 25235ని తాకింది. ఆ తరవాత కోలుకుని 42 పాయింట్ల లాభంతో 25,278 వద్ద ముగిసింది. అలాగే సెన్సెక్స్‌ కూడా ఇంట్రాడేలో 82,725 స్థాయిని తాకిన చివరికి 194 పాయింట్ల లాభంతో 82,559 వద్ద ముగిసింది. ఇవాళ చాలా వరకు సూచీలు లాభాల్లో కన్పించినా… అనేక షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి కన్పించింది. ముఖ్యంగా బజాజ్‌ ట్విన్స్‌ బాగా రాణించాయి. ఇవాళ హిందాల్కో, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా ఉంది. ముఖ్యంగా డెరివేటివ్స్‌ విభాగంలో డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్‌లో తీవ్ర ఒత్తిడి కన్పించింది. ఈ షేర్‌ 6,250 స్ట్రయిక్‌ ఆప్షన్‌ ఏకంగా ఇవాళ 5140 శాతం పెరిగింది ఈ ఆప్షన్‌ క్రితం ధర 25 పైసలు కాగా, ఇవాళ రూ. 14.60ని తాకి రూ. 13 వద్ద ముగిసింది. ఇంకా ఎంసీఎక్స్‌,జుబ్లియంట్‌ ఫుడ్‌, ఆల్కెమ్‌ పుట్స్‌ కూడా 1200 నుంచి 1400 శాతం దాకా లాభాలను ఇచ్చాయి. ఇక కాల్స్‌ విషయానికొస్తే గుజరాత్ గ్యాస్‌ ఆప్షన్స్‌ అత్యధికంగా 850శాతం లాభాన్ని ఇచ్చింది.