For Money

Business News

ఫెడ్‌ నిర్ణయంపై డెరివేటివ్స్‌ ఎఫెక్ట్‌

ఏకంగా అర శాతం మేరకు వడ్డీ రేట్లను తగ్గించాలని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయించింది. దీనికి ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. అమెరికా ప్యూచర్స్‌ ఒకటిన్నర శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ఉదయం ఆసియా మార్కెట్లు, మిడ్‌ సెషన్‌ తరవాత యూరో మార్కెట్లు ఆకర్షణీయ లాభాల్లో ఉన్నాయి. అయితే మన మార్కెట్లలో అలాంటి ఉత్సాహం కొరవడింది. దీనికి ప్రధాన కారణం డిరివేటివ్స్‌ వీక్లీ క్లోజింగ్‌. ఉదయం ఆరంభంలోనే కొత్త ఆల్‌టైమ్‌ హై 25611ని తాకిన నిఫ్టి… క్రమంగా లాభాలను కోల్పోయింది. మిడ్‌ సెషన్‌లో రెండు గంటల ప్రాంతంలో ఏకంగా క్రితం స్థాయి వరకు చేరిన నిఫ్టి చివర్లో కోలుకుంది. ముఖ్యంగా మిడ్‌ క్యాప్‌, ఐటీ షేర్లు సూపర్‌గా రికవర్‌ అయ్యాయి. వీటితో పాటు నిఫ్టి స్వల్పంగా కోలుకుని 25418 వద్ద అంటే 38 పాయింట్ల లాభంతో నిఫ్టి ముగిసింది. నిఫ్టితో పోలిస్తే బ్యాంక్‌ నిఫ్టి చాలా పటిష్ఠంగా ముగిసింది. బ్యాంక్‌ నిఫ్టి ఒకదశలో 52,847ని తాకినా… తరవాత కోలుకుని అర శాతం లాభంతో 53,037 వద్ద ముగిసింది. ఏయూ బ్యాంక్‌ ఇవాళ కూడా మూడు శాతంపైగా లాభంతో క్లోజైంది. నిఫ్టి విషయానికొస్తే ఎన్‌టీపీసీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. తరవాతి స్థానంలో టైటాన్‌, నెస్లే, కొటక్‌ బ్యాంక్‌, టాటా కన్జూమర్‌ నిలిచాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో బీపీసీఎల్‌ టాప్‌లో ఉంది.