For Money

Business News

చివర్లో మద్దతు

మే నెల డెరివేటివ్స్‌ పాజిటివ్‌గా క్లోజయ్యాయి. ఉదయం ఆరంభంలో రీటైల్‌ ఇన్వెస్ట్ల స్క్వేర్‌ ఆఫ్‌ సమయంలో నిఫ్టి ఒక మోస్తరుగా నష్టపోయింది. మిడ్‌ సెషన్‌ తరవాత నష్టాలు మరింత పెరిగి 18202ను తాకింది. అయితే చివర్లోల అంటే స్క్వేర్‌ ఆఫ్‌ సమయంలో కోలుకుని 35 పాయింట్ల లాభంతో 18321 వద్ద ముగిసింది. ఇవాళ నిఫ్టికి బ్యాంకుల నుంచి ఎలాంటి మద్దతు అందలేదు. నిఫ్టి మిడ్ క్యాప్ మాత్రం 0.85 శాతం లాభపడింది. అలాగే నిఫ్టి నెక్ట్స్‌ 50 సూచీ 0.56 శాతం పెరిగింది. నిన్న డల్‌గా ఉన్న అదానీ ఎంటర్‌ప్రైజస్‌ ఇవాళ స్వల్పంగా లాభపడింది. నిఫ్టిలో బాజాజ్‌ ఆటో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఒక శాతంపైగా నష్టంతో విప్రో నష్టపోయింది. అదానీ మిడ్‌ క్యాప్స్‌లో ఇవాళ లాభాల స్వీకరణ కన్పించింది. ఈ సూచీలో 4.5 శాతం లాభంతో జొమాటొ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. మిడ్‌ క్యాప్‌ సూచీ ఇవాళంతా గ్రీన్‌లో ఉంది. ఉదయం పరిమిత లాభాల్లో ఉండగా, క్రమంగా పెరుగుతూ వచ్చింది. జూబ్లియంట్ ఫుడ్‌ ఇవాళ టాప్‌ గెయినర్‌గా నిలిచింది.