For Money

Business News

నిఫ్టి@18500

ఇవాళ భారీ లాభాలతో నిఫ్టి ముగిసింది. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైనా… క్రమంగా బలపడుతూ 18500లకు చేరువైంది. జూన్‌ నెల డెరివేటివ్స్‌ శుభారంభం చేశాయి. నిఫ్టికి ఇవాళ మిడ్‌ క్యాప్‌ షేర్లతో పాటు రిలయన్స్‌, ఎఫ్‌ఎంసీజీ కౌంటర్లు అండగా నిలిచాయి. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 178 పాయింట్ల లాభంతో 18499 వద్ద ముగిసింది. నిఫ్టిలో కేవలం 7 షేర్లు మాత్రమే నష్టాల్లో ముగిశాయి. నిఫ్టిలో వెయిటేజీ అధికంగా ఉన్న షేర్లలో ర్యాలీ రావడంతో సూచీలు జోరుగా లాభాలు పొందాయి. సన్ ఫార్మా లాభాల్లోకి రావడంతో ఈ కంపెనీ షేర్‌ టాప్‌ 5 గెయినర్స్‌లో నిలిచింది. ఓఎన్‌జీసీ ఇవాళ టాప్ లూజర్‌గా నిలిచింది. అదానీ షేర్లలో ఒత్తిడి కన్పించింది. బ్యాంకు షేర్లకు ఇవాళ మద్దతు కొనసాగింది.