మిడ్ క్యాప్స్ విలవిల

ఇవాళ దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టి పలు కీలక స్థాయిలను కోల్పోవడంతో ఇన్వెస్టర్లు చాలా షేర్లను వొదలించుకున్నారు. నిఫ్టి, సెన్సెక్స్ 1.32 శాతం చొప్పున నష్టపోగా.. మిడ్ క్యాప్ నష్టాలు మూడు శాతంపైనే ఉన్నాయి. ఇక స్మాల్ క్యాప్స్‌లోనూ ఇదే అమ్మకాల హోరు. నిఫ్టిలో కేవలం ఆరు షేర్లు నామమాత్రపు లాభాలతో క్లోజ్ కాగా, 44 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇవాళ మొత్తం 2,918మ షేర్లు ట్రేడవగా, కేవలం 326 షేర్లు గ్రీన్‌లో ముగిశాయి. ఇక ఎఫ్ అండ్ ఓలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ విభాగంలో కేవలం రెండు షేర్లు లాంగ్‌లో ఉన్నాయి. అంటే కొనుగోళ్ళు జరిగాయి. అవి కూడా నామమాత్రంగా. అన్ని రంగాల షేర్లలో ఉప్పెనలా అమ్మకాల ఒత్తిడి వస్తోంది. మార్కెట్ ట్రెండ్ పూర్తిగా నెగిటివ్‌గా ఉంది. ట్రంప్ దుండుకు చర్యల వల్ల అనేక షేర్లలో అమ్మకాలు జరుగుతుండగా, దేశీయంగా జీడీపీ వృద్ధి రేటు ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఉండదనే సంకేతాలు వస్తున్నాయి. దీంతో అనలిస్టులు కూడా ఇన్వెస్టర్లను హెచ్చరిస్తున్నారు. భారీ నష్టాలు పొందిన షేర్ల జోలికి వెళ్ళొద్దని అంటున్నారు.