బ్యాంకు ముంచినా… స్థిరంగా నిఫ్టి
ఇవాళ బ్యాంక్ షేర్లలో భారీ ఒత్తిడి వచ్చింది. దీనికి ప్రధాన కారణం కొటక్ మహీంద్రా బ్యాంక్‌లో 4 కోట్ల బల్క్ డీల్. ఈ డీల్ రూ.1700 వద్ద జరిగింది. అంటే నిన్నటి క్లోజింగ్ ధరకు మూడు శాతం తక్కువ. దీంతో ఓపెనింగ్‌లోనే దాదాపు మూడు శాతం నష్టంతో కొటక్ బ్యాంక్ ప్రారంభమైంది. దీని ప్రభావం కారణంగా రోజంతా బ్యాంకు షేర్లు ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్ షేర్ పడుతూనే ఉన్నాయి. నిఫ్టి టాప్ లూజర్స్‌లో కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు ఉండటం విశేషం ఉదయం నుంచి నష్టాల్లో ఉన్న నిఫ్టి రెండు సార్లు గ్రీన్‌లోకి వచ్చింది. మిడ్ సెషన్ తరవాత కూడా గ్రీన్లోకివచ్చే ప్రయత్నం చేసినా సఫలం కాలేదు. దీంతో 23 పాయింట్ల నష్టంతో 17222 వద్ద ముగిసింది. వాస్తవానికి డాక్టర్ రెడ్డీస్‌తో పాటు పలు మెటల్స్ ఆకర్షణీయ లాభాలు పొందినా నిఫ్టి బ్యాంక్ కారణంగా మార్కెట్ నష్టాల్లో ముగిసింది. నిఫ్టి నెక్ట్స్, నిఫ్టి మిడ్ క్యాప్ సూచీలు మాత్రం గ్రీన్‌లో ముగిశాయి. సెన్సెక్స్ 89 పాయింట్ల నష్టంతో 57595 వద్ద ముగిసింది.