For Money

Business News

చివరలో ట్రెంట్‌ ఝలక్‌

మార్కెట్‌ ఇవాళ రోజంతా ఒక మోస్తరు ట్రేడింగ్‌కు పరిమితమైంది. ఉదయం వంద పాయింట్ల లాభంతో ప్రారంభమైనా 10 గంటలకల్లా నష్టాల్లోకి జారుకుంది. ఆ తరవాత మార్కెట్‌కు పెద్దగా మద్దతు లభించలేదు. పెరిగినపుడల్లా అమ్మకాల ఒత్తిడి వచ్చింది. దీంతో నిఫ్టి పలు మార్పలు లాభ నష్టాల్లోకి వచ్చింది. చివర్లో నష్టాల్లో ఉన్నా… ట్రెంట్‌ ఇచ్చిన ఉత్సాహంతో నిఫ్టి గ్రీన్‌లో ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి ఏడు పాయింట్ల లాభంతో 24,335 వద్ద ముగిసింది. మిడ్‌ క్యాప్‌ మినహా దాదాపు అన్ని ప్రధాన సూచీలు రెడ్‌లో ముగిశాయి. ఇవాళ 2933 షేర్లు ట్రేడవగా, 1478 షేర్లు నష్టాల్లో, 1365 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ట్రెంట్‌ స్వల్ప లాభాలతో ప్రారంభమై… ఒకదశలో నష్టాల్లోకి జారుకున్నా చివరల్లో వచ్చిన ఫలితాల కారణంగా షేర్‌ రూ.300 లాభంతో ముగిసింది. ఇవాళ నిఫ్టి షేర్లలో 5 శాతం లాభంతో ట్రెంట్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. బీఈఎల్‌, టెక్‌ మహీంద్రా, రిలయన్స్‌, ఎటర్నల్‌ తరవాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక నష్టాల్లో ముగిసిన నిఫ్టి షేర్లలో సన్‌ ఫార్మా టాప్‌లో ఉంది. తరువాతి స్థానంలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ ఉన్నాయి.