For Money

Business News

ట్రెండ్‌ మారింది

రాత్రి అమెరికా మార్కెట్లు, ఉదయం నుంచి ఆసియా మార్కెట్ల తీరు చూస్తుంటే ఇవాళ మన మార్కెట్లు స్థిరంగా ముగిసినట్లే. నిఫ్టి సూచీ కూడా కేవలం 8 పాయింట్ల లాభంతో 22552 వద్ద ముగిసింది. అయితే ట్రెండ్‌ మాత్రం బేరిష్‌గానే ఉంది. కీలక రంగాల నుంచి ఇవాళ మార్కెట్‌కు మద్దతు లభించలేదు. అనేక సార్లు నిఫ్టి నష్టాల్లోకి వెళ్ళి మళ్ళీ లాభాల్లోకి వచ్చింది. దిగువస్థాయిలో మద్దతు వచ్చినా… నిఫ్టి కాస్త పెరగ్గానే.. సప్లయ్‌ వస్తోంది. నిఫ్టి దిగువస్థాయి నుంచి 250 పాయింట్లు పెరిగినా… అందులో బలం లేదు. 2988 షేర్లలో 1818 షేర్లు నష్టాల్లో ముగిశాయి. గత కొన్ని రోజులుగా రిలయన్స్‌ నుంచి మార్కెట్‌కు మద్దతు లభిస్తోంది. ఈ షేర్‌ ఇవాళ 3 శాతంపైగా లాభపడి నిఫ్టి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. దాదాపు నాలుగు శాతం నష్టంతో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ నిఫ్టి టాప్‌ లూజర్‌గా నిలిచింది.