For Money

Business News

స్మాల్‌ క్యాప్స్‌కు భారీ నష్టాలు

కేవలం మూడు ప్రధాన రంగాలను మినహాయిస్తే దాదాపు అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా వస్తోంది. స్వల్ప లాభాలతో సూచీలు ముగిసినా… స్మాల్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ షేర్లలో మాత్రం ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారు. ఆర్బీఐ ఇచ్చిన ప్రోత్సాహకాల కారణంగా ఎన్‌బీఎఫ్‌సీ షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. రోజంతా బ్యాంక్‌ నిఫ్టి గ్రీన్లో ఉన్నా… చివరల్లో భారీ ఒత్తిడికి లోనై… నామమాత్రపు లాభాలతో ముగిసింది. వాస్తవానికి పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు భారీగా నష్టపోయాయి. ఇవాళ ఫిబ్రవరి డెరివేటివ్స్‌ స్థిరంగా ముగిశాయి. నిఫ్టి కేవలం రెండు పాయింట్ల నష్టంతో ముగిసింది. 22545 వద్ద నిఫ్టి క్లోజైంది. సూచీలు స్వల్పంగా నష్టపోయినట్లు కన్పిస్తున్నా… అత్యధిక శాతం షేర్లు నష్టాలతో ముగివాయి. నిఫ్టిలో 31 షేర్లు నష్టపోయాయి. ఇవాళ 2936 షేర్లు ట్రేడవగా, 2292 షేర్లు నష్టాలతో ముగిశాయి. ఇక ఇవాళ 41 షేర్లు అప్పర్‌ సర్క్యూట్‌తో క్లోజ్‌ కాగా, 201 షేర్లు లోయర్‌ సర్క్యూట్‌లో ముగిశాయి. 397 షేర్లు ఇవాళ 52 వారాల కనిష్ఠ స్థాయి వద్ద ముగిశాయి. ఇటీవలి కాలంలో వచ్చిన లాభాలన్నీ గత రెండు నెలల్లో తుడుచు పెట్టుకుపోయాయి. పాలిక్యాబ్‌ ఇవాళ ఏకంగా 20 శాతం నష్టపోయింది. అలాగే కేఈఐ ఇండస్ట్రీస్‌ షేర్‌ 21 శాతంపైగా నష్టంతో ముగిసింది.