For Money

Business News

కోలుకున్నా నష్టాల్లోనే…

నిఫ్టికి ఇవాళ కూడా దిగువ స్థాయిలో మద్దతు లభించింది. ఒకదశలో 22801 పాయింట్లకు పడిన నిఫ్టికి మద్దతు లభించడంతో మళ్ళీ లాభాల్లోకి వచ్చింది. 22992 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకిన తరవాత 14 పాయింట్ల నష్టంతో 22945 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్‌ టోన్‌ బేరిష్‌గా ఉంది. ఇవాళ 53 షేర్లు లాంగ్‌ పొజిషన్స్‌ కన్పించగా, 19 షేర్లలో షార్ట్‌ కవరింగ్‌ వచ్చింది.అయితే 107 షేర్లలో షార్ట్‌ పొజిషన్స్‌ పెరగ్గా, లాంగ్‌ అన్‌వైండింగ్‌ 51 షేర్లలో కన్పించింది. ఇవాళ మొత్తం 2928 షేర్లు ట్రేడవగా, 2128 షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంటే సూచీలు దాదాపు క్రితం ముగింపు వద్దే ముగిసినట్లు కన్పించినా… మెజారిటీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. 47 షేర్లు అప్పర్‌ సర్క్యూట్‌లో క్లోజ్‌ కాగా, 296 షేర్లు లోయర్‌ సర్క్యూట్‌లో ముగిశాయి. అందుకే సాధారణ ఇన్వెస్టర్లు మార్కెట్‌కు దూరంగా ఉన్నారు. ఇక నిఫ్టి విషాయనికొస్తే ఇవాళ ఎన్‌టీపీసీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఇక ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ టాప్‌ లూజర్‌గా ముగిసింది. మిడ్‌ క్యాప్‌లో ఎన్‌ఎల్‌సీ షేర్‌ 8 శాతం, పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌ 4.68 వాతం లాభంతో టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి.