For Money

Business News

దిగువస్థాయిలో మద్దతు

నిఫ్టి ఇంకా కన్సాలిడేషన్ మోడ్‌లో కొనసాగుతోంది. పైకి ఎగబాకడం కష్టంగా ఉన్నా… పడినపుడు దిగువన మద్దతు లభిస్తోంది. లిక్విడిటీ మార్కెట్‌ను నడుపుతున్నా… ఇన్వెస్టర్లు మాత్రం రోజు రోజుకూ నష్టపోతున్నారు. మ్యూచువల్‌ ఫండ్‌లు, దేశీయ ఇన్వెస్టర్లను సూచీలకు ప్రాతినిధ్యం వహించే షేర్లలో ఇన్వెస్ట్‌ చేస్తూ… వాటిని కాపాడుతున్నా… ఇతర షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఈ ట్రెండ్‌ ఇంకెంత కాలం అన్నది చూడాలి. ఫెడ్‌ వడ్డీ రేట్లను పావు శాతమే తగ్గిస్తే పరిస్థితి ఏమిటి? ఈ అనిశ్చితి కారణంగానే నిఫ్టి స్థిరంగా ఉంటోంది. ఇవాళ కూడా ఉదయం 25,352 పాయింట్లకు పడినా వెంటనే కోలుకుని.. మిడ్‌ సెషన్‌ కల్లా 25,441ని తాకింది. కాని అక్కడి నుంచి స్వల్పంగా క్షీణించి 35 పాయింట్ల లాభంతో 25,418 వద్ద ముగిసింది. ఇతర సూచీలు కూడా స్థిరంగా ముగిశాయి. నిఫ్టిలో 29 షేర్లు క్షీణించగా టాటా మోటార్స్‌, ఐషర్‌ మోటార్స్‌ టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. ఇక నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో హీరో మోటోకార్ప్‌, బజాజ్‌ ఆటో, భారతీ ఎయిర్‌టెల్‌, ఎన్‌టీపీసీ, ఎం అండ్‌ ఎం ముందున్నాయి.

Leave a Reply