నిఫ్టి: ఆరంభ లాభాలు ఆవిరి
ఆగస్ట్ డెరివేటివ్ సిరీస్ ఇవాళ పెద్ద మార్పులు లేకుండానే ముగిసింది. అనేక సార్లు మార్కెట్ నష్టాల్లోకి వెళ్ళినా… 16,600 ప్రాంతంలో గట్టి మద్దతు లభించింది. ఒకదశలో 16,683 పాయింట్లకు చేరినా.. మిడ్ సెషన్లో 16,603 పాయింట్లను తాకింది. తరవాత ఆటుపోట్లకు లోనైనా 2 పాయింట్ల లాభంతో 16,636 పాయింట్ల వద్ద ముగిసింది. మిడ్ క్యాప్ షేర్ల సూచీ స్వల్ప నష్టాలతో ముగిసింది. మిగిలిన సూచీలన్నీ స్థిరంగానే ముగిశాయి. రోల్ ఓవర్స్ గత నెలస్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది. మొత్తానికి నిఫ్టి 16,600 పాయింట్ల పైన ముగియడం బుల్స్‌కు కాస్త ప్లస్గానే భావించాలి.
నిఫ్టి టాప్ గెయినర్స్
బ్రిటానియా 3,945.40 2.67
టాటా కన్జూమర్ 854.50 2.21
బీపీసీఎల్ 468.85 1.77
హెచ్డీఎఫ్సీ లైఫ్ 699.45 1.73
రిలయన్స్ 2,232.00 1.33
నిఫ్టి టాప్ లూజర్స్
భారతీ ఎయిర్టెల్ 585.40 -4.42
జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 671.75 -1.77
మారుతీ 6,609.95 -1.51
ఎస్బీఐ 410.35 -1.42
హిందాల్కో 424.60 -1.42