For Money

Business News

స్థిరంగా ముగింపు…

ఉదయం నుంచి దాదాపు ఒకే స్థాయిలో ట్రేడైన నిఫ్టి చివరల్లో కాస్త ఒత్తిడికి లోనైనా… దాదాపు క్రితం ముగింపు స్థాయి వద్దే ముగిసింది. చివరి క్షణాల్లో నిఫ్టి దాదాపు 70 పాయింట్ల వరకు నష్టపోయింది. అయితే చివరి 15 నిమిషాల సగటు ఆధారంగా నిఫ్టి లెక్కిస్తారు కాబట్టి… 24334 వద్ద ముగిసినట్లు తేలింది. చివరల్లో సెన్సెక్స్‌ 300 పాయింట్లకుపైనే నష్టపోయింది. ఇవాళ చూడటానికి దాదాపు అన్ని సూచీలు స్థిరంగా ఉన్నా… మిడ్ క్యాప్‌ షేర్లలో గట్టి ఒత్తిడి వచ్చింది. ఈ సూచీ అర శాతం దాకా నష్టపోయింది. ఇవాళ నిఫ్టి 2977 షేర్లు ట్రేడవగా 2228 షేర్లు నష్టాల్లో ముగిశాయి. కేవలం 631 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇవాళ నిఫ్టి షేర్లలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ షేర్‌ 4 శాతంపైగా లాభపడి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. తరువాతి స్థానాల్లో మారుతీ, ఎస్‌బీఐ లైఫ్‌, భారతీ ఎయిర్‌ టెల్‌, సన్‌ ఫార్మా ఉన్నాయి. ఇక నష్టాల్లో ముగిసిన నిఫ్టి షేర్లలో బజాజ్‌ ట్విన్స్‌ ఉన్నాయి. తరువాతి స్థానంలో ట్రెంట్‌ ఉంది. టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. బజాజ్‌ ట్విన్స్‌ లాభాల స్వీకరణ రాగా, ట్రెంట్‌లోనూ దాదాపు అదే పరిస్థితి. నిన్న 5 శాతంపైగా లాభపడిన ట్రెంట్‌ఇవాళ 4.76 శాతం నష్టపోయింది.