25,400 దిగువన నిఫ్టి

ఉదయం నుంచి మార్కెట్ తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురైంది. అక్కడక్కడా లాభాల స్వీకరణ కన్పించినా.. చాలా వరకు అమ్మకాల జోరు అధికంగా ఉంది. టీసీఎస్, టాటా ఎలెక్సి ఫలితాల నేపథ్యంలో ఐటీ షేర్లలో ఆసక్తి అంతంత మాత్రమే ఉంది. దాదాపు అన్ని ప్రధాన రంగాల సూచీలు నష్టాల్లో క్లోజ్ కావడం ఇవాళ్టి విశేషం. దీనికి తోడు ఐటీ ఫలితాలపై ఇన్వెస్టర్లకు పెద్ద అంచనాలు లేకపోవడంతో నిఫ్టి ఇవాళ 120 పాయింట్ల నష్టంతో 25355 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 345 పాయింట్లు నష్టపోయింది. లాభాల్లో ముగిసిన నిఫ్టి షేర్లలో ఇండస్ ఇండ్ బ్యాంక్, మారుతీ, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, జియో ఫైనాన్స్ ఉన్నాయి. ఇక నష్టాల్లో ముగిసిన నిఫ్టి షేర్లలో భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, అపోలో హాస్పిటల్స్, శ్రీరామ్ ఫైనాన్స్ ఉన్నాయి.