25200 దిగువకు నిఫ్టి
ఇవాళ ఆరంభం గ్రీన్‌లో ఉన్నా… మిడ్ సెషన్ తరవాత వచ్చిన లాభాల స్వీకరణ కారణంగా నిఫ్టి 53 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఉదయం ఆరంభంలో 25275 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి క్లోజింగ్‌కు ముందు 25127 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే 53 పాయింట్ల నష్టంతో 25146 పాయింట్ల వద్ద ముగిసింది. సెప్టెంబర్ నెల తొలివారం డెరివేటివ్స్ క్లోజింగ్ ప్రభావం నిఫ్టిపై స్పష్టంగా కన్పించింది. అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్‌లో ఉన్నా మన సూచీలు బలహీనంగా ముగిశాయి. నిఫ్టి మినహా ఇతర ప్రధాన రంగాల సూచీలు గ్రీన్‌లో ముగియడం విశేషం. ఇవాళ నిఫ్టి టాప్ గెయినర్స్‌లో టైటాన్, ఎల్ అండ్ టీ మైండ్ ట్రీ, విప్రో, బీపీసీఎల్, ఐటీసీ ఉన్నాయి. ఇక నష్టాల్లో ముగిసిన నిఫ్టి షేర్లలో సిప్లా, డాక్టర్ రెడ్డీస్, కోల్ ఇండియా, రిలయన్స్, బ్రిటానియా షేర్లు ఉన్నాయి.