For Money

Business News

మళ్ళీ 25,000 దిగువన…

ఇవాళ ఓ అరగంట పాటు గ్రీన్‌లో ఉన్న నిఫ్టి… రోజంతా నష్టాల్లోనే ఉంది. నిన్న మద్దతుగా నిలిచిన బ్యాంకు, ఫైనాన్స్‌ షేర్ల సూచీలు ఇవాళ హ్యాండిచ్చాయి. ఐటీ షేర్ల మద్దతుతో టీసీఎస్‌ నష్టంతో సరి అన్నట్లు ఉంది. నిఫ్టికి అండగా ఉన్న ప్రత్యేక రంగమంటూ లేదు. షేర్లు మాత్రమే. టాటా గ్రూప్‌నకు చెందిన ట్రెంట్‌ పది వేల రూపాయల మార్క్‌ను దాటేందుకు రెడీ అవుతోంది. ఇక నిఫ్టి విషయానికొస్తే క్రితం ముగింపుతో పోలిస్తే 34 పాయింట్ల నష్టంతో 24,964 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 230 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టి షేర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతుండగా… మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్ల సూచీ మాత్రం లాభాల్లో కొనసాగి… ఇవాళ్టి గరిష్ఠ స్థాయి వద్ద ముగిశాయి. నిఫ్టిలో 28 షేర్లు గ్రీన్‌లో ఉన్నా… నష్టాలు జోరు అధికంగా ఉండటంతో నిఫ్టి నష్టాల్లో ముగిసింది. నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో ట్రెంట్‌ తరవాత హిందాల్కో, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, ఓఎన్‌జీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇక నిఫ్టి లూజర్స్‌లో టీసీఎస్‌ ఉంది. ఈ షేర్‌ రెండు శాతం దాకా ఉంది. ఉదయ నష్టాల నుంచి కోలుకుని లాభాల్లోకి వచ్చినా… చివరికి రెండు శాతం నష్టంతో ముగిసింది. ఎం అండ్‌ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్‌, సిప్లా, అదానీ ఎంటర్‌ప్రైజస్‌ షేర్లు నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో ఉన్నాయి.

Leave a Reply