For Money

Business News

ఐటీ షేర్ల దెబ్బ

బ్యాంక్‌ నిఫ్టి వీక్లీ డెరివేటివ్స్‌ ముగింపు పెద్ద హడావుడి లేకుండా ముగిసింది. బ్యాంకు షేర్లలో కాస్త ఒత్తిడి వచ్చినా… పీఎస్‌యూ బ్యాంకులతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నుంచి వచ్చిన మద్దతు కారణంగా బ్యాంక్‌ నిఫ్టి కేవలం 0.2 శాతం నష్టంతో ముగిసింది. నిఫ్టి ఫైనాన్షియల్‌ లాభాల్లో ముగిసింది. ఇతర రంగాల్లో రియాల్టి షేర్ల సూచీ భారీగా పెరిగినా… వీటికి నిఫ్టిలో ప్రాధాన్యం అంతంత మాత్రమే. నిఫ్టిలోని ఐటీ షేర్లలో వచ్చిన అమ్మకాల ఒత్తిడి కారణంగా నిఫ్టి ఇవాళ 86 పాయింట్ల నష్టంతో ముగిసింది. మిడ్‌సెషన్‌లో భారీ నష్టాలతో 24908ని తాకినా… తరవాత కోలుకుంది. మూడు గంటల ప్రాంతంలో దాదాపు గ్రీన్‌లోకి వచ్చినట్లు కన్పించిన నిఫ్టిలోఅనూహ్య ఒత్తిడి వచ్చింది. మళ్ళీ నష్టాలు పెరిగాయి. నిఫ్టి 24,971 వద్ద ముగిసింది. ఇవాళ మిడ్‌ క్యాప్‌ షేర్లలో పెద్దగా ఒత్తిడి లేదు. నిఫ్టిలో 34 షేర్లు నష్టాలతో క్లోజ్‌ కాగా, 16 షేర్లు లాభాలతో ముగిశాయి. నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, గ్రాసిం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఆటో టాప్‌లో ఉన్నాయి. నిఫ్టి లూజర్స్‌లో ట్రెంట్‌ ఇవాళ నాలుగు శాతం దాకా నష్టపోయింది. చివరల్లో స్వల్పంగా కోలుకుని 3.61 శాతం నష్టంతో ముగిసింది. తరవాతి స్థానాల్లో ఎం అండ్‌ ఎం, ఇన్ఫోసిస్‌, హీరో మోటార్స్‌, అదానీ పోర్ట్స్‌ ఉన్నాయి.

Leave a Reply