For Money

Business News

క్రిడిట్‌ పాలసీని పట్టించుకోలేదు

వరుసగా పదోసారి కూడా ఆర్బీఐ క్రెడిట్‌ పాలసీ కమిటీ (ఎంపీసీ) వడ్డీ రేట్లలో మార్పులు చేయరాదని నిర్ణయించరాదని నిర్ణయించారు. మార్కెట్‌ కూడా ఇదే అంశాన్ని ఇది వరకే డిస్కౌంట్‌ చేసింది. దీంతో ఆర్బీఐని ఇవాళ మార్కెట్‌ ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఆర్బీఐ గవర్నర్‌ ప్రసంగం పూర్తయిన వెంటనే మార్కెట్‌ పతనం కావడం ఆరంభమైంది. ఉదయం 25,234 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకిన మార్కెట్‌ క్రమంగా క్షీణిస్తూ వచ్చి… సరిగ్గా మూడు గంటల ప్రాంతంలో రెడ్‌లోకి వెళ్ళింది. చివరల్లో కోలుకున్నట్లు కన్పించినా… చివరి క్షణాల్లో కూడా అమ్మకాల ఒత్తిడి రావడంతో 25000 దిగువన క్లోజైంది. ఇవాళ గరిష్ఠ స్థాయితో పోలిస్తే నిఫ్టి ఏకంగా 250 పాయింట్లను నష్టపోయింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 31 పాయింట్లు నష్టపోగా, సెన్సెక్స్‌ 167 పాయింట్ల నష్టంతో క్లోజైంది. నిఫ్టిలో మెజారిటీ షేర్లు అంటే 31 షేర్లు లాభాల్లో ముగిసినా… నిఫ్టికి నష్టాలు తప్పలేదు. నిఫ్టి నెక్ట్స్‌ 50 ఒక శాతం దాకా పెరిగింది. దీనికి ప్రధాన కారణం దివీస్‌ ల్యాబ్‌. ఈ షేర్‌ ఏకంగా 8 శాతం లాభపడగా, సీమెన్స్‌, డి మార్ట్‌ షేర్లు నాలుగు శాతంపైగా లాభంతో ముగిశాయి. దివీస్‌ను ఇటీవల నిఫ్టి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో సిప్లా, ట్రెంట్, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ, టెక్‌ మహీంద్రా ఉన్నాయి. నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో ఐటీసీ అగ్రస్థానంలో ఉంది. ఈ షేర్‌ మూడు శాతం నష్టపోయింది. నెస్లే ఇండియా, ఓఎన్జీసీ, రిలయన్స్‌, హిందుస్థాన్‌ లీవర్‌ షేర్లు కూడా టాప్‌ లూజర్స్‌లో ఉన్నాయి.

Leave a Reply