For Money

Business News

ఇలా పడిందేమిటి?

పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 4 శాతం
మెటల్‌ సూచీ 3 శాతం
సెంట్రల్‌ పీఎస్‌ఈ సూచీ 3 శాతం
క్యాపిటల్‌ గూడ్స్‌ సూచీ 3 శాతం
రియాల్టి సూచీ 3.36 శాతం
బ్యాంక్‌ నిఫ్టి 1.29 శాతం
మిడ్‌ క్యాప్ 100 సూచీ 2.5 శాతం
స్మాల్‌ క్యాప్‌ 100 సూచీ 3.75 శాతం
ఐటీ, ఎఫ్‌ఎంసీజీ నష్టం ఒక శాతం లోపే
ఇది ఇవాళ మార్కెట్‌లో పరిస్థితి. ఇంకా నికార్సుగా చెప్పాలంటే. ఎన్‌ఎస్‌ఈలో ఇవాళ గ్రీన్‌లో ముగిసిన షేర్ల సంఖ్య 224కాగా. నష్టాల్లో ముగిసిన షేర్ల సంఖ్య 2,280. దీన్ని బట్టి మార్కెట్‌లో ఎలాంటి భయానక వాతావరణం నెలకొందో అర్థమౌతుంది. అయితే మార్కెట్‌ ఇంకా పడుతుందా? వరుసగా పడుతుందా అన్నదానికి మాత్రం ఇపుడు సమాధానం దొరకడం లేదు. రేపు బ్యాంక్‌ నిఫ్టి క్లోజింగ్‌, ఎల్లుండి వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉన్నందున… దిగువస్థాయిలో షార్ట్‌ కవరింగ్‌ వస్తుందేమో చూడాలి. వస్తుందన్న గ్యారంటీ మాత్రం ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు తగ్గినమాట నిజమే కాని… అవి పూర్తిగా ఆగిపోయాయా అన్న నమ్మకం మార్కెట్‌లో లేదు. ఇవాళ నిఫ్టి 24,882 పాయింట్ల స్థాయిని తాకినా… అక్కడి నుంచి ఏకంగా 400 పాయింట్లు క్షీణించింది. చివరికి 309 పాయింట్ల నష్టంతో 24,472 పాయింట్ల వద్ద ముగిసింది. ఇవాళ నిఫ్టిలో కేవలం ఐసీఐసీఐ బ్యాంక్‌, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్ మాత్రమే గ్రీన్‌లోముగిశాయి. మిగిలిన 47 షేర్లు నష్టాల్లోముగిశాయి. దాదాపు నాలుగు శాతం నష్టంతో బీఈఎల్‌ టాప్‌ లూజర్‌గా నిలిచింది.

Leave a Reply