For Money

Business News

23,000 దిగువనే…

ఆర్బీఐ తీసుకున్న చర్యల కారణంగా ఇవాళ బ్యాంక్‌ షేర్లు భారీగా లాభాలు పొందాయి. బ్యాంక్‌ నిఫ్టి 1.67 శాతం లాభంతో ముగిసింది. దాదాపు ప్రధాన బ్యాంకు షేర్లన్నీ ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. నిఫ్టి ఒకదశలో 23,137 పాయింట్ల స్థాయికి చేరినా.. చివరల్లో వచ్చిన అమ్మకాల ఒత్తిడి, లాభాల స్వీకరణ కారణంగా నిఫ్టి 23000 దిగువన అంటే 22957 వద్ద ముగిసింది. ఇక స్మాల్‌ క్యాప్‌లో పెద్దగా లాభాల్లేవ్‌. మిడ్‌ క్యాప్‌ సూచీ ఏకంగా అర శాతంపైగా నష్టంతో ముగిసింది. నిఫ్టిలో 28 షేర్లు లాభాలతో ముగిశాయి. ఇవాళ 2937 షేర్లు ట్రేడవగా… 1920 షేర్లు నష్టాలతో క్లోజ్‌ కాగా… 940 షేర్లు గ్రీన్‌లో ముగిశాయి. అంటే మార్కెట్‌ ఇంకా చాలా బలహీనంగా ఉందన్నమాట. మొత్తం షేర్లలో 538 షేర్లు 52 వారాల కనిష్ఠ స్థాయిని తాకగా, కేవలం 6 షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకాయి. అప్పర్‌ సర్క్యూట్‌ను తాకిన షేర్ల సంఖ్య కేవలం 36 కాగా, 346 షేర్లు లోయర్‌ సర్క్యూట్‌లో ముగిశాయి. దీన్ని బట్టి మార్కెట్‌ ఇంచా చాలా వీక్‌ ఉందని చెప్పొచ్చు.