For Money

Business News

కోలుకున్నా… 18500 దిగువనే

చివరి గంటలో మార్కెట్‌లో స్వల్ప రికవరీ వచ్చింది. బ్యాంక్‌ నిఫ్టి నష్టాల నుంచి లాభాల్లోకి రావడంతో నిఫ్టి కూడా కోలుకుంది. ఉదయం 18664ను తాకిన నిఫ్టి అక్కడి నుంచి క్షీణిస్తూ మిడ్‌ సెషన్‌ తరవాత 18410 పాయింట్లను తాకింది. 250 పాయింట్లు నష్టపోయిన నిఫ్టి…చివరి గంటలో దాదాపు వంద పాయింట్లకు పైగా కోలుకంది. క్లోజింగ్‌లో 112 పాయింట్ల నష్టంతో 18496 వద్ద ముగిసింది. నిఫ్టిలో ఇవాళ విలన్‌ పాత్ర పోషించింది ఐటీ షేర్లు. రియాల్టి షేర్ల సూచీ రెండు శాతం క్షీణించినా.. సూచీలను ప్రభావితం చేసింది మాత్రం ఐటీ షేర్లే. గైడెన్స్‌ను తగ్గించడంతో హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్‌ ఇవాళ ఆరున్నర శాతం నష్టంతో ముగిసింది. నిఫ్టి టాప్‌ లూజర్స్‌లోని అయిదు షేర్లూ ఐటీ రంగానికి చెందినవి కావడం విశేషం. నిఫ్టి నెక్ట్స్‌లో కూడా ఎంఫసిస్‌, ఎల్‌ అండ్‌ టీ మైండ్‌ ట్రీ షేర్లు మూడున్నర శాతం క్షీణించాయి. నిఫ్టినెక్ట్స్‌ను ఇవాళ పేటీఎం షేర్‌ కాపాడింది. ఈ షేర్‌ ఇవాళ ఏడు శాతం లాభంతో ముగిసింది. అలాగే మారికో కూడా 2.64 శాతం లాభంతో ముగిసింది. బ్యాంక్‌లో వెయిటేజి ఎక్కువగా ఉన్న ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్ల వల్ల ఈ సూచీ గ్రీన్‌లో ముగిసింది. వాస్తవానికి ఇతర షేర్లు భారీగా పడ్డాయి. ఇటీవల బాగా పెరిగిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ రెండున్నర శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రెండు శాతం క్షీణించాయి. ఎఫ్‌ఎంసీజీ షేర్లు ఇవాళ బాగా లాభపడ్డాయి. నెస్లే నుంచి మారికో వరకు అనేక షేర్లు ఇవాళ ఆకర్షణీయ లాభాలు గడించాయి.