For Money

Business News

టాప్‌ గేర్‌లో ఆటో సేల్స్

పండుగ, పెళ్ళిళ్ళ సీజన్‌ మద్దతుతో నవంబర్‌ నెలలో ఆటో సేల్స్‌ రికార్డు స్థాయిలో 23,80,465కి చేరాయి. గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే అమ్మకాలు 26 శాతం పెరిగాయిన ఆటోమొబైల్ డీలర్స్‌ అసోసియేషన్‌ (FADA) తెలిపింది. గత ఏడాది నంబర్‌లో 18,93,647 యూనిట్లు అమ్ముడుపోయాయి. బీఎస్‌-IV నుంచి బీఎస్‌-VIకు మారిన 2020 మార్చి నెలను పక్కనపెడితే.. భారత వాహన పరిశ్రమ చరిత్రలోనే ఒకే నెలలో ఈ స్థాయిలో అమ్మకం జరగడం ఇదే మొదటిసారి. పండగ సీజన్‌ తరవాత వచ్చిన పెళ్లిళ్ల సీజన్‌ దీనికి కారణమని ఫాడా పేర్కొంది. వీటిలో ప్యాసింజర్‌ వెహికల్స్‌ అమ్మకాలు 21 శాతం పెరిగి 3,00,922 యూనిట్లకు చేరాయి. అలాగే టూ వీలర్స్‌ అమ్మకాలు కూడా 24 శాతం పెరిగి యూనిట్లకు చేరాయి. గత ఏడాది వనంబర్‌లో 14,94,797 యూనిట్లు అమ్ముడుబోగా… ఈ నవంబర్‌లో అమ్మకాలు 18,47,708 యూనిట్లకు చేరాయి. ఇక కమర్షియల్‌ వాహనాల అమ్మకాలు 33 శాతం పెరిగి 79,369 యూనిట్లకు చేరాయి. త్రీ వీలర్స్‌ అమ్మకాలు 81 శాతం, ట్రాక్టర్ల అమ్మకాలు 57 శాతం వృద్ధి చెందాయి.