For Money

Business News

బ్లాక్‌స్టోన్‌ చేతికి కేర్‌ హాస్పిటల్‌?

 

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న కేర్‌ హాస్పిటల్స్‌ టేకోవర్‌కు రంగం సిద్ధమైంది. ఈ హాస్పిటల్‌ కొనేందుకు ప్రయత్నించినా… ప్రపంచంలోనే అతి పెద్ద ప్రైవేట్ ఈక్విటీ గ్రూప్ అయిన బ్లాక్‌స్టోన్ చివరికి నిలిచినట్లు తెలుస్తోంది. అన్ని కంపెనీలకంటే అత్యధికంగా రూ. 7,800- 8,000 కోట్లు చెల్లించేందుకు బ్లాక్‌స్టోన్‌ రెడీ అయినట్లు సమాచారం.
సింగపూర్‌కు చెందిన టెమాసెక్‌కు చెందిన షీర్స్ హెల్త్‌కేర్ చివరి వరకు పోటీ పడినా, దాని కంటే ఎక్కువ మొత్తాన్ని బ్లాక్‌ స్టోన్‌ ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. మొత్తం 2,400 పైగా పడకల సామర్థ్యమున్న కేర్‌ హాస్పిటల్‌ చైన్‌ ప్రస్తుతం TPG గ్రోత్ ప్లాట్‌ఫామ్, ఎవర్‌కేర్ చేతిలో ఉంది.  2016 జనవరిలో కేర్‌ హాస్పిటల్స్‌లో 72 శాతం వాటాను అడ్వెంట్‌ క్యాపిటల్‌ నుంచి రూ. 2000 కోట్లకు అబ్రాజ్‌ కొనుగోలు చేసింది. అయితే, ఆ సంస్థ దివాలా తీయడంతో 2019లో కేర్‌ హాస్పిటల్స్‌ పగ్గాలు ఎవర్‌కేర్‌ గ్రూప్‌ చేతికి వచ్చాయి.