భారీ నష్టాలతో ముగిసిన నిఫ్టి
చివర్లో కాస్త షార్ట్ కవరింగ్ తప్ప నిఫ్టికి ఎక్కడా మద్దతు అందలేదు. మిడ్‌సెషన్ తరవాత కూడా నిఫ్టిలో అమ్మకాలు సాగాయి. ఒకదశలో 18209కి చేరిన నిఫ్టి క్లోజింగ్‌లో 18266 వద్ద ముగిసింది. గరిష్ఠ స్థాయి నుంచి 250 పాయింట్లు క్షీణించడంతో షార్ట్ సెల్లర్స్‌కు ఇవాళ పండుగే అని చెప్పాలి. ఇక నిఫ్టిలో 39 షేర్లు నష్టాలతో ముగిశాయి. అనూహ్యంగా ఇవాళ టెలికాం షేర్లు నిఫ్టికి అండగా వచ్చాయి. అలాగే ఎస్బీఐ,టాటా మోటార్స్. మెటల్స్ ఇవాళ బాగా పెడ్డాయి. అలాగే మిడ్ క్యాప్ నిఫ్టి కూడా చివరిదాకా అమ్మకాల జోరు సాగడంతో 1.93 శాతం క్షీణించింది. నిఫ్టి తరవాత ఆ స్థాయి షేర్లు ఉన్న నిఫ్టి నెక్ట్స్ 1.7 శాతం క్షీణించిందంటే .. ఒత్తిడి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిఫ్టికి తొలి మద్దతు స్థాయి ఇవాళ పోయింది. రేపు మరో కీలక పరీక్ష ఎదురు కానుంది నిఫ్టికి.