For Money

Business News

నష్టాలతో ముగిసిన నిఫ్టి

రెండో సెషన్‌ వచ్చిన అమ్మకాల ఒత్తిడితో నిఫ్టి 18,000 దిగువన ముగిసింది. ఇవాళ మార్కెట్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకుంది. దాదాపు మిడ్‌ సెషన్‌ వరకు నష్టాల్లోనే ఉంది. అయితే క్రమంగా కోలుకుంటూ మధ్యాహ్నం ఒంటి గంటకు లాభాల్లో వచ్చింది. అక్కడి నుంచి ఒక గంట సేపు పెరిగిన నిఫ్టి 18095 పాయింట్ల గరిష్ఠ స్థాయి 18095ని తాకింది. సరిగ్గా రెండు గంటలకు మార్కెట్‌లో ఒత్తిడి ప్రారంభమైంది. లాభాలతో ప్రారంభమైన యూరో మార్కెట్‌, అమెరికా ఫ్యూచర్స్‌ కూడా నష్టాల్లోకి రావడంతో నిఫ్టి క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. క్రితం ముగింపుతో పోలిస్తే 96 పాయింట్ల నష్టంతో 17,957 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టి 0.53 శాతం నష్టపోగా, సెన్సెక్స్‌ మాత్రం 0.72 శాతం నష్టంతో 60,176 వద్ద ముగిసింది. హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌తో పాటు బజాజ్‌ ఫైనాన్స్‌ టాప్‌ లూజర్స్‌గా నిలిచారు. గెయినర్స్‌లో అదానీ పోర్ట్స్‌ నిలిచింది. ఆటో షేర్లు వెలుగులో ఉన్నాయి. టాప్‌లో లేకున్నా ఎన్‌టీపీసీ క్రమంగా బలపడుతూ వస్తోంది.