For Money

Business News

17200 దిగువన క్లోజైన నిఫ్టి

నిఫ్టి అత్యంత కీలకమైన 17200 పాయింట్ల దిగువన ముగిసింది. మిడ్‌ సెషన్‌ వరకు ఒక మోస్తరు నష్టాలతో ఉన్న నిఫ్టి … యూరో మార్కెట్ల దెబ్బకు కుదేలైంది. అమెరికా ఫ్యూచర్స్‌ ఇవాళ కూడా రెడ్‌లోఉండటంతో ఇన్వెస్టర్ల భారీగా అమ్మకాలకు పాల్పడ్డారు. ఉదయం 17149 పాయింట్లకు పడిన నిఫ్టి మిడ్‌ సెషన్‌కల్లా కోలుకుని 17300 దాటింది. కాని మిడ్‌ సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్‌ నష్టాలు ఒక శాతంపైగా ఉండటంతో ఒత్తిడి అధికమైంది. 17,177 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 220 పాయింట్లు నష్టపోయింది. ఉదయం నుంచి ఒక మోస్తరు నష్టాల్లో ఉన్న నిఫ్టి మిడ్‌ క్యాప్‌ కూడా మిడ్‌సెషన్‌ తరవాత బాగా నష్టపోయి ఒక శాతం నష్టంతో ముగిసింది. నిఫ్టి నెక్ట్స్‌ 0.7 శాతం నష్టంతో ముగిసింది. ఇవాళ నిఫ్టిని దారుణంగా దెబ్బతీసింది బ్యాంక్‌ కౌంటర్లే. నిఫ్టి బ్యాంక్‌ ఇవాళ రెండు శాతంపైగా నష్టపోయింది. ప్రధాన బ్యాంకలు రెండు నుంచి మూడు శాతం నష్టంతో ముగిశాయి. సూచీలోని 12 షేర్లూ నష్టంలో ముగియడం విశేషం.