15800 దిగువన ముగిసిన నిఫ్టి
నిఫ్టికి అత్యంత కీలక స్థాయి ఇవాళ పోయింది. దాదాపు సపోర్ట్ లెవల్స్ పోయినట్లే. ఇక మిగిలిన ప్రధాన స్థాయి 15700. మార్కెట్ చివరి గంటలో దిగువ స్థాయి నుంచి స్వల్పంగా కోలుకుంది. దీంతో 15684 పాయింట్ల స్థాయి నుంచి స్వల్పంగా కోలుకుని 15774 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 427 పాయింట్లు క్షీణించింది. అదే సెన్సెక్స్ 1456 పాయింట్లు పడింది. నిఫ్టిలో నెస్లే, బజాజ్ ఆటో స్వల్ప లాభాలతో ముగిశాయి. మిగిలిన 48 షేర్లు నష్టాల్లో క్లోజయ్యాయి. బజాజ్ ట్విన్స్‌తో పాటు హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్ భారీగా నష్టపోయాయి. బజాజ్ ఫిన్‌సర్వ్ 6.7 శాతం క్షీణించగా, బజాజ్ ఫైనాన్స్ 5.21 శాతం తగ్గింది. ఇక సూచీల వరకు చూస్తే నిఫ్టి నెక్ట్స్ రెండు శాతం క్షీణించగా… నిఫ్టి 2.64 శాతం తగ్గింది. నిఫ్టి మిడ్ క్యాప్, నిఫ్టి బ్యాంక్, నిఫ్టి ఫైనాన్షియల్ సూచీలు మూడు శాతంపైగా నష్టంతో ముగిశాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 5 శాతంపైగా తగ్గింది. ప్రధాన ఐటీ కంపెనీలతో పాటు మిడ్ క్యాప్ ఐటీ షేర్లు బాగా క్షీణించాయి. నిఫ్టి మిడ్ క్యాప్, నిఫ్టి బ్యాంక్‌లో టాప్ గెయినర్స్ లేవు.