వరుసగా 12వ రోజు…
అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా మారడంతో మన మార్కెట్లలో లాభాలు కొనసాగాయి. వరుసగా 12వ సెషన్స్‌లో కూడా నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ముగిసింది. ఒకదశలో 25199 పాయింట్ల స్థాయిని తాకినా… వెంటనే కోలుకుని 25268 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరి పావు గంటల లాభాల స్వీకరణ వచ్చినా నిఫ్టి 25235 పాయింట్ల వద్ద ముగిసింది. అనేక సెషన్స్ నుంచి నిఫ్టి పడినపుడల్లా ఇన్వెస్టర్ల నుంచి మద్దతు లభిస్తోంది. ఏ ఒక్క సెక్టార్ నుంచి కాకుండా… పలు బ్లూచిప్ షేర్లు మార్కెట్‌కు అండగా నిలుస్తున్నాయి. నిఫ్టి 83 పాయింట్లు లాభపడగా, సెన్సెక్స్ 231 పాయింట్లు లాభపడింది. అమెరికా ఫ్యూచర్స్ ఆకర్షణీయ లాభాల్లో ఉండటంతో ఆగస్టు సిరీస్ లాభాలతో ప్రారంభమైంది. పైగా ఈ నెలలో రోలోవర్స్ కూడా భారీగా ఉన్నాయి. ఇక నిఫ్టిలో సిప్లా, బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, దివీస్ ల్యాబ్, ఎన్‌టీపీసీ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, కోల్ ఇండియాతో పాటు రిలయన్స్ షేర్లు ఉన్నాయి.