For Money

Business News

భారీ లాభాలు వచ్చినా…?

నిఫ్టి ఇవాళ దిగువస్థాయి నుంచి 300 పాయింట్లు పెరిగింది. ఉదయం నష్టాలతో ప్రారంభమై 22,245 పాయింట్లను తాకినా.. వెంటనే కోలుకుని రోజంతా క్రమంగా పెరుగుతూ వచ్చింది. గరిష్ఠ స్థాయి 22556 కాగా దాదాపు అదే స్థాయి అంటే 22544 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 207 పాయింట్లు పెరిగింది. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గడంతో పెయింట్‌ కంపెనీల షేర్లు బాగా పెరిగాయి. అలాగే వేసవి మండిపోతుండటంతో పవర్‌, పవర్‌ సంబంధిత రంగాల షేర్లలో లాభాలు వచ్చాయి. అలాగే కొన్ని మెటల్‌ కౌంటర్స్‌. అయితే మిడ్‌ క్యాప్‌ షేర్ల సూచీ ఉదయం ఆకర్షణీయ లాభాలు గడించినా… తరవాత క్రమంగా ఆ లాభాలను కోల్పోయింది. అలాగే బ్యాంక్‌ నిఫ్టి కూడా ఇవాళ మార్కెట్‌ ర్యాలీకి దూరంగా ఉంది. కొన్ని ఎఫ్‌ఎంసీజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కన్పించింది. నిఫ్టిలో 38 షేర్లు లాభాలతో ముగిశాయి. ఇవాళ కూడా మెజారీటీ షేర్లు గ్రీన్‌లో ముగిశాయి. 2996 షేర్లు ట్రేడవగా, 2207 షేర్లు లాభాల్లో క్లోజ్‌ కాగా, 716 నష్టాలతో ముగిశాయి. ఇక అప్పర్‌ సర్క్యూట్‌ తాకిన షేర్ల సంఖ్య 258 కాగా, లోయర్‌ సర్క్యూట్‌లో ముగిసిన షేర్ల సంఖ్య 55. లాభాలు పొందిన నిఫ్టి షేర్లలో ఏషియన్‌ పెయింట్స్‌, కోల్‌ ఇండియా టాప్‌లో ఉన్నాయి. నిఫ్టి లూజర్స్‌ టెక్‌ మహీంద్రా, ట్రెంట్‌ ముందు ఉన్నాయి.