రూమర్స్ లేదా రిలీఫ్ ర్యాలీ?

ఇవాళ మార్కెట్‌లో ఉదయం నుంచి సూచీలు ఆకర్షణీయ లాభాల్లో ఉన్నాయి. కొన్ని రంగాలు మినహా మిగిలిన రంగాల్లో షేర్లు జోరు అనూహ్యంగా ఉంది. కనడా, మెక్సికోలపై విధించిన ఆంక్షలపై అమెరికా పునరాలోచన చేస్తోందని, దీనికి సంబంధించి చర్చలు ప్రారంభమౌతాయని వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 2 నుంచి భారత ఉత్పత్తులపై సుంకాలు పెంచుతామని ట్రంప్ హెచ్చరించినా.. మార్కెట్ పట్టించుకోలేదు. ముఖ్యంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీల దూకుడు మార్కెట్ వర్గాలను ఆశ్చర్య పర్చింది. ఈ రంగాల షేర్ల సూచీలు మూడు శాతంపైగా లాభపడటం విశేషం. ఒక మోస్తరు లాభాలకు బ్యాంక్ నిఫ్టి పరిమితమైంది ఇవాళ. లేకుంటే నిఫ్టి ర్యాలీ ఇంకా జోరుగా ఉండేది. ఫైనాన్షియల్స్ నిఫ్టిలో దాదాపు కదలికే లేదు. చాన్నాళ్ళ తరవాత నిఫ్టిలో 46 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇవాళ అదానీ షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఇవాళ 2967 షేర్లు ట్రేడవగా, 2461 షేర్లు లాభాల్లో ముగిశాయి. అలాగే 68 షేర్లు లోయర్ సర్క్యూట్‌లో క్లోజ్ కాగా, 290 షేర్లు అప్పర్ సర్క్యూట్‌లో ముగిశాయి. నిఫ్టి ఇవాళ 254 పాయింట్ల లాభంతో 22337 వద్ద ముగిసింది.రేపు మార్చి నెల తొలి వారం డెరివేటివ్స్ క్లోజింగ్. ఇవాళ వచ్చిన షార్ట్ కవరింగ్ రేపు కూడా వస్తుందేమో చూడాలి.