For Money

Business News

23700పైన ముగింపు…

నిన్న మార్కెట్‌ భారీగా నష్టపోయినా… దిగువ స్థాయిలో మద్దతు లభించింది. నిన్నటి కనిష్ఠ స్థాయితో పోలిస్తే కేవలం రెండు సెషన్స్‌లో నిఫ్టి 500 పాయింట్లు లాభపడింది. నిన్న చాలా వరకు నష్టాలను పూడ్చుకున్న నిఫ్టి ఇవాళ ఆరంభంలో కూడా ఇన్వెస్టర్లకు మంచి అవకాశమిచ్చింది. 23509 వద్ద ప్రారంభమైనా.. 23423 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. కాని అక్కడి నుంచి కోలుకున్న నిఫ్టి చివరి వరకు పెరుగుతూనే వచ్చింది. కెనడా, మెక్సికోలపై తాను విధించిన ఆంక్షలను ఓ నెల వరకు అమెరికా వాయిదా వేయడంతో స్టాక్‌ మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. ఇదే వారం ఆర్బీఐ క్రెడిట్‌ పాలసీ ఉండటంతో… నిఫ్టికి ఇవాళ గట్టి మద్దతు లభించింది. అలాగే బ్యాంక్‌ నిఫ్టికి కూడా. క్లోజింగ్‌ సమయంలో నిఫ్టి 23762 పాయింట్ల గరిష్ఠ స్థాయికి తాకి… 23739 వద్ద ముగిసింది. అంటే దాదాపు అధిక స్థాయి వద్దే క్లోజైంది. బడ్జెట్‌లో ప్రకటించిన రూ. 12 లక్షల వరకు పన్ను మినహాంపు మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది. ఒక్క ఎఫ్‌ఎంసీజీ రంగం మినహా… మిగిలిన రంగాలన్నీ లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఎన్‌బీఎఫ్‌సీ, బ్యాంకింగ్‌ రంగ షేర్లకు గట్టి మద్దతు లభించింది. ట్రెంట్‌ షేర్‌ ఆరున్నర శాతం నష్టపోవడంతో ఎఫ్‌ఎంసీజీ రంగ సూచీ దెబ్బతింది. ఇవాళ 2899 షేర్లు ట్రేడవగా, 1951 షేర్లు లాభాల్లో ముగిశాయి. శ్రీరామ్‌ ఫైనాన్స్‌ నిఫ్టి షేర్లలో టాప్‌ గెయినర్‌ కాగా, ట్రెంట్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో అగ్రస్థానంలో ఉంది.