For Money

Business News

గరిష్ఠ స్థాయి వద్ద క్లోజింగ్‌

నిఫ్టి ఇవాళ ఆకర్షణీయ లాభాలతో ముగిసింది. చాలా రోజుల తరవాత గరిష్ఠ స్థాయి వద్ద ముగిసింది. దిగువస్థాయిలో నిఫ్టికి గట్టి మద్దతు అందడంతో 25,100పైన నిఫ్టి నిలబడగలిగింది. ఇవాళ ప్రధానంగా రియాల్టి, ఐటీతోపాటు బ్యాంకు షేర్ల నుంచి గట్టి మద్దతు అందింది నిఫ్టికి. ఈ మూడు రంగాల సూచీలు ఇవాళ ఒక శాతంపైగా లాభపడ్డాయి. ఫైనాన్స్‌ నిఫ్టి కూడా. ఇదే సమయంలో మిడ్‌ క్యాప్‌ షేర్లకు కూడా మద్దతు అందడంతో ఇన్వెస్టర్లు చాలా వరకు హ్యాపీగా ఉన్నారు. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 183 పాయింట్ల లాభంతో 25140 పాయింట్ల (తాత్కాలిక) వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ కూడా 591 పాయింట్లు లాభపడింది. రేపు హ్యుందాయ్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ప్రారంభం కానుంది. ఈ ఆఫర్‌ ప్రభావం సెకండరీ మార్కెట్‌పై ఏమాత్రం ఉంటుందో రేపు చూడాల్సి ఉంది. బ్రెంట్‌ క్రూడ్‌ ఇవాళ రెండు శాతంపైగా క్షీణించడం కూడా మార్కెట్‌కు ఒక పాజిటివ్‌ సిగ్నల్‌. అమెరికా మార్కెట్లు గత శుక్రవారం గ్రీన్‌లో ముగిశాయి. ఫ్యూచర్స్‌ కూడా పాజటివ్‌గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టికి మద్దతు కొనసాగుతోంది. ఈనెల 17వ తేదీన బోనస్‌ ఇష్యూ అంశాన్ని బోర్డు పరిశీలిస్తుందని విప్రో ప్రకటించింది. దీంతో ఈ షేర్‌ ఇవాళ 4 శాతంపైగా లాభంతో ముగిసింది. నిఫ్టి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఆ తరవాతి స్థానాల్లో టెక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ ఉన్నాయి. ఇక నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో ఓఎన్‌జీసీ నిలిచింది. ఆ తరవాతి స్థానాల్లో మారుతీ, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజస్‌ ఉన్నాయి.

Leave a Reply