17.000 దిశగా… నిఫ్టి ఆల్‌టైమ్ రికార్డు
ఒక్క ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు భారీ లాభాలతో ముగియడంతో నిఫ్టి కొత్త రికార్డులు సృష్టించింది. ఇవాళ ఆల్‌టైమ్ హై 16,931 వద్ద ముగిసింది. 17,000 పాయింట్ల దిశగా నిఫ్టి పరుగులు పెట్టింది. డాలర్ పతనంతో మెటల్స్, ఫార్మా షేర్లతో పాటు బ్యాంక్ షేర్లు భారీ లాభాలతో ముగిశాయి. ఇవాళ 16,764 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి అక్కడి నుంచి 200 పాయింట్ల దాకా పెరిగి 16,951 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. బ్యాంక్ నిఫ్టి రెండు శాతంపైగా పెరగ్గా, మిడ్ క్యాప్ షేర్ల సూచీ కూడా దాదాపు అదే స్థాయి లాభాలతో ముగిసింది. నిఫ్టిలో 43 షేర్లు లాభాలతో ముగిశాయి. మార్కెట్ అనలిస్టులను మించి నిఫ్టి ఇవాళ పరుగులు తీయడానికి కారణంగా…మెటల్స్‌కు అనుగుణంగా అనేక బ్రోకింగ్ సంస్థలు నివేదికలు ఇవ్వడం. అనేక రోజుల తరవాత ఫార్మా షేర్ల కూడా గట్టి మద్దతు లభించింది. ఆసియా, యూరో మార్కెట్లు ఒక మోస్తరు లాభాలతో ట్రేడవగా. మన మార్కెట్లు దూసుకుపోతున్నాయి.
నిఫ్టి టాప్ గెయినర్స్
భారతీ ఎయిర్‌టెల్ 625.00 5.02
దివీస్ ల్యాబ్ 5,119.00 4.24
యాక్సిస్ బ్యాంక్ 782.75 4.03
టాటా స్టీల్ 1,436.70 3.80
కోల్ ఇండియా 143.30 3.43
నిఫ్టి టాప్ లూజర్స్
టెక్ మహీంద్రా 1,424.80 -1.43 నెస్లే ఇండియా 19,736.00 -1.11
ఐషర్ మోటార్స్ 2,547.55 -1.11
ఇన్ఫోసిస్ 1,699.85 -0.52
విప్రో 632.05 -0.46